Breaking News
Home > TELUGU > SPECIALS > ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర – పార్ట్ 1

ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర – పార్ట్ 1

ఉయ్యూరు పట్టణంలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ ఏకాదశి వరకు పదిహేను రోజుల పాటు వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరుగు తాయి .ఈ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేది శుక్ర వారం నుండి పదిహేడవ తేది శుక్ర వారం వరకు ఈ సంబరాలు జరుగు తున్నాయి .అందుకని ,అందరికీ తల్లి అయిన వీరమ్మ పేరంటాలు తిరునాళ్ళు ,ఆ జేజితల్లి దివ్య చరిత్రను ఊస్సుల్లో ఉయ్యూరు లో ధారా వాహికం గా మీందరి కోసం అందిస్తున్న్నాను .అసలు గ్రామ దేవతల ప్రత్యేకత ను గురించి ముందు తెలుసు కోవాలి

గ్రామ దేవతలు

స్త్రీలు ప్రకృతి స్వరూపాలు .ప్రకృతి అంటే ప్రకృష్టమైన దాన్ని సృష్టించటం -అంటే -ఏదైనా సృష్టి చేయటం లో ,పరమ ప్రవీణు రాలైన వారిని ప్రకృతి అంటారు .సత్వ గుణానికి ”ప్ర”అనీ ,రాజోగునాన్ని ”కృ”అనీ ,తమో గుణాన్ని ”తి”అనీ అంటారు .అంటే ,త్రిగుణాత్మకమై ,సర్వ శక్తి సంపన్నమై సృష్టి లోని అన్ని కార్యాలకు ప్రదాను రాలే ప్రకృతి .అందుకే ఆమెను ”ప్రధానం ‘లేక ప్రకృతి అంటారు .ఇంకో రకం గా ఆలోచిస్తే ”ప్ర”అంటే ప్రధమం .”కృ”అంటే సృష్టి .అంటే సమస్త మైన శక్తికీ ,మొదటి కారణ స్వరూపిణి అని అర్ధం .సృష్టి కోసం పరబ్రహ్మ తనతకు తానే రెండు రూపాలుగా ,విభాక్తుడైనాడు .ఆ స్వరూపాలే మనం చెప్పుకొనే ప్రకృతి ,పురుషుడు .శరీరం లోని కుడి భాగం పురుషుడు ,ఎడమ భాగం ప్రకృతి అంటే స్త్రీ .ఆ ప్రకృతి అంశ తో జగత్తు ను పాలించే సకల దేవతలూ ఎర్పడుతున్నారు .అలాంటి దేవతలలో ఉయ్యూరు వీరమ్మ తల్లి ,పెద్దింటి నాంచారమ్మ ,పెనుగంచిప్రోలు తిరుపతమ్మ,,అంకాలమ్మ,సమ్మక్క సారక్క మొదలైన దేవతలను గ్రామ దేవతలు అంటారు .ఈ దేవతల ప్రభావం జానపదుల మీదే కాక సామాన్య జను లందరి పైనా వుంది .వారు సర్వ జనుల మనోభీస్టాలను నెర వెరచే సర్వ సమర్ధులు గా ప్రసిద్ధి కెక్కారు .ఒక్కొక్క గ్రామ దేవతకు ఒక్కొక్క మహిమ వుంటుంది .వీరికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేక పోయినా ప్రత్యెక సందర్భాలలో సంబరాలు ,తిరునాళ్ళు జరుగు తాయి .ఆ రోజుల్లో పల్లెల్లో సందడే సందడి .సాధారణం గా మాఘ మాసం నుంచి వరుస గా ఈ దేవతలకు తిరునాళ్ళు జరుగుతూ వుంటాయి .

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

మాఘ శుద్ధ ఏకాదశి నుంచి ,పదిహేను రోజులు ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు ఘనం గా ,అమోఘం గా జరుగు తాయి .తిరునాళ్ళు అంటే తిరు అంటే పవిత్రమైన నాడులు అంటే రోజులు .ఆ మాటే తిరునాళ్ళు గా మారింది .అంటే మంచి రోజులని మొత్తం మీద అర్ధం .కృష్ణా జిల్లా లోనే అత్యంత ప్రాముఖ్యం కలవి వీరమ్మ తిరునాళ్ళు .జిల్లా లోని అన్ని ప్రాంతాల నుంచే కాక ,రాష్ట్రం లో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి ,వీరమ్మ తల్లిని దర్శించు కోని ,మొక్కులు చెల్లించుకొని సేవిస్తారు .ఇక్కడ గొప్పతనం ఏమిటంటే హిందువులే కాదు ముస్లిములు ,క్రిస్తియన్లు అందరు భక్తీ తో అమ్మ వారిని కొలవటం .అందరు ”వీరమ్మ తల్లి ”అని నోరారా పిలుస్తుంటే ,ఒళ్ళు గగుర్పొడుస్తుంది .ఏ మతం వాడైనా ”వీరమ్మ ”అని ఏక వచనం తో పిలవనే పిలవరు .అందుకే వీరమ అందరికీ తల్లి అయింది .అందరి కోర్కెలను తీర్చే దేవతగా ప్రసిద్ధి కెక్కింది .మతసామ రాశ్యానికి వీరమ్మ తల్లి తిరునాళ్ళు గొప్ప ఉదాహరణ .లక్ష లాది భక్తులు అమ్మ వారిని దర్శించి ,పూజించి కానుకలు సమర్పించుకొంటారు .

ఆలయ ప్రవేశం

ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి రాత్రి అమ్మ వారు ఉయ్యూరు లో రావి చెట్టు దగ్గర లో వున్న ,అత్త వారింటి నుంచి ,మేళ తాళాలతో అట్టహాసం గా బయల్దేరు తుంది ”.గండ దీపాలు ”అంటే మట్టి ప్రమిదలలో నూనె తో లేక ఆవునేతి తో వెలిగించిన ఒత్తులను చేతి తో పట్టు కోని ,అవి కాల కుండా జాగ్రత్త వహిస్తూ ,మనసు లోని కోర్కెలను తీర్చు కోవటానికి ,వేలాది మంది స్త్రీలు పిల్లలు,మగవారు అమ్మ వారి వెంట నడుస్తారు కాళ్ళకు చెప్పులుండవు .ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన పల్లకి లాంటి దానిలో ,పీఠం మీద ,వీరమ్మ అమ్మ వారినీ ,భర్త చింతయ్య ల కొయ్య విగ్రహాలను చక్క గా కూర్చోబెట్టి ,మనుష్యులు మాత్రమే మోస్తూ ,అందులో ముఖ్యం గా ఆలయ పూజారులు భక్తీ శ్రర్ధ లతో మోస్తూ ,ఊరేగింపు చేస్తారు .దీన్నే అమ్మ వారు గుళ్ళోకి వెళ్ళటం అంటారు .అత్త వారిల్లైన గుడి నుంచి బయల్దేరే ముందు ,ఉయ్యూరు టౌన్ పోలిస్స్టేషన్ అధికారి -ఇన్స్పెక్టర్ అమ్మ వారికి పసుపు ,కుంకుమ నూతన వస్త్రాలు సమర్పించటం ఆన వాయితీ గా వస్తోంది .స్టేషన్ నుంచి వీటిని ఊరేగింపు గా మేళ తాళాలతో తీసుకొని వచ్చి ,అమ్మ వారికి సమర్పిస్తారు .లక్షలాది భక్తులు ఈ ఆలయ ప్రవేశాన్ని ,కన్నులారా చూసి పులకిస్తారు .గ్రామ వీధుల గుండా ఈ ఉత్సవం సాగుతుంది .ప్రతి ఇంటి దగ్గర పసుపు ,కుంకుమ తో కలిపినా నీటిని ,అమ్మ వారు రాగానే ‘వార’లాగా పోస్తారు .కొబ్బరికాయ ,హారతి ఇస్తారు .భక్తులంతా ”వాలా ,వాలా ”అనే నినాదం చేస్తుండగా ఉత్సాహం గా ఊరేగింపు సాగుతుంది .కోలాటాలు ,భజనలు ,బాండ్ మేళాలతో ,రోడ్లన్నీ ప్రతిధ్వనిస్తాయి .కిక్కిరిసిన జనం తో , కోలాహలం గా వుంటాయి రోడ్లన్నీ .గండ దీపం పట్టు కోని ముఖానికి పెద్ద కుంకుమ బొట్టు పెట్టు కోని ,కాళ్ళకు పసుపు రాసుకొని ,మహిళా మతల్లులు అమ్మ వారి వెంట నడుస్తుంటే,ప్రతి స్త్రీ వీరమ్మ తల్లి లాగే కని పిస్తుంది .మెయిన్ రోడ్డు చేరిన అమ్మ వారు ఉయ్యాల స్తంభాల దగ్గర ఉయ్యాల లూగుతుంది .ఇక్కడ జంతు బలి వుంటుంది .తర్వాత మళ్ళీ బయల్దేరి ,తాను అగ్ని ప్రవేశం చేసిన చోట ,కట్టిన ఆలయంలో ప్రవేశిస్తుంది .ఇక్కడ పదిహేను రోజులుంది ,భక్తులను అనుగ్రహిస్తుంది .పశువులను చక్క గా కడిగి ,సింగారించి ,రైతులు తోలుకు వచ్చి ,గుడి చుట్టూ తిప్పుతారు .ఎడ్ల బండ్లను ,వాహనాలను ,ఆలయం చుట్టూ తిప్పి ,రక్ష గా భావిస్తారు అత్త వారింటి నుంచి బయల్దేరిన వీరమ్మ తల్లికి ,ఆలయం చేరా టానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పడుతుంది .అంటే మర్నాడు రాత్రికి కాని ఆలయ ప్రవేశం చేయలేదు .కొత్త బట్టలతో ,బోనాలతో ప్రతి ఇంటా పండగ వాతావరణమే .బంధు మిత్రుల రాక తో ఇళ్ళన్నీ పెళ్లి కళ ను సంత రించుకోని శోభిస్తాయి . .

Part -2

 

Check Also

Software Developer

Newzen infotech Location : Hyderabad TS IN Requirement with B.Tech freshers (2015,2016,2017) for software developer …